Abhishek Rao's custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది.