దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉంది. తొలి నుంచి సామాన్యుడి కష్టాలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో ‘చీపురు’తో ఊడ్చి పారేశారు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి సత్తా ఎంటో నిరూపించారు. సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపార్టీకి దేశ రాజధానిలో తిరుగు లేకుండా పోతుంది. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ తో…
చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ కుమ్ములాటల కారణంగా అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. రాజీనామా చేసిన తరువాత ఢిల్లీ వెళ్లివచ్చిన ఆయన కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేదని చెప్తూనే, వచ్చే ఎన్నికల్లో సిద్ధూని ఒడించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరో 15 రోజుల్లోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా…
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధూ అలక దిగివచ్చి పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ పదవిలో కొనసాగనున్నారు. అయితే, సిద్ధూ చెప్పిన విధంగా ప్రభుత్వంలో పాలన సాగితే మరోసారి అంతర్గత విభేదాలు బహిరంగమయ్యే అవకాశం ఉన్నది. కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ త్వరలోనే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక గురించి మాట్లాడారు. ఒకవేళ చీలిక…
వచ్చే ఏడాది పంజాబ్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ కీలక నిర్ణయం తీసుకొని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా పక్కనపెట్టి పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించింది. దీంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దళితులకు సీఎం పదవి ఇచ్చామని చెప్పడమే కాకుండా పార్టీలో అంతర్గత విభేదాలకు తావులేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది.…
గుజరాత్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా చేసుకొని బీజేపీ ఎత్తులు వేస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పటేల్ వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆప్ కూడా తన మనుగడ చాటుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుజరాత్‌లో పారిశ్రామిక నగరమైన సూరత్‌లో ఆ పార్టీ బలంగా ఉన్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 20 వార్డులు గెలుచుకొని తన ఉనికిని చాటుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో…
వచ్చే ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పెద్దరాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లు ఉన్నాయి. అయితే, ముందస్తు సర్వే గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లో మరోసారి కాషాయం పార్టీకి పట్టంగట్టే అవకాశం ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పీసీసీలో ప్రక్షాళన చేసింది. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్‌ను కొనసాగిస్తూనే పార్టీ పగ్గాలను మాత్రం…
దేశంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈరోజు వివిధ పార్టీలతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు ఆహ్వానించారు. తృణమూల్‌తో సహా వివిధ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఆప్, ఆకాళిదళ్ పార్టీలకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ రెండు పార్టీలు మినహా మిగతా విపక్షపార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వేయాల్సిన అడుగులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. Read:…
పార్లమెంట్ సమావేశాలలో విపక్ష పార్టీల ఉమ్మడి వ్యూహం ఖరారు చేసేందుకు ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ అధ్యక్షత సమావేశం అయ్యారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు… తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఎస్పీ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, సీపీఐ, ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా సమాలోచనలు జరిపారు. అంతేగాక, కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ బయట…
ఇప్పటికే ఢిల్లీలో విజయవంతమైన ఉచిత విద్యుత్ హీమీని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నది ఆప్. ఇందులో భాగంగా ఆప్ ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఈ హామీని ఇచ్చింది. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే తప్పకుండా ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ఆప్ పేర్కొన్నది. ఆప్ హమీపై పంజాబ్ యువతి వెరైటీగా స్పందించింది. తనకు ఉచిత విద్యుత్ అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్…
వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన ముద్రవేయాలని అప్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగా పంజాబ్‌లో ఆప్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించింది. చంఢీగ్ పర్యటనకు ఒకరోజు ముందుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో పంజాప్ ఆప్ కేడర్ మరింత ఉత్సాహంగా మారింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యత్…