ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తాజా కేసు నమోదు చేసింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ నాయకులు బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రాన్ని రాక్షస రాజు హిరణ్యకశిపుడితో పోల్చారు. పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుపించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. కొంతమంది తమను తాము హిరణ్య కశ్యపుడిలా భావించుకుంటూ తమను తాము దేవుడిలా…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ మంజూరు కాకముందే మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరారు. ఢిల్లీ మంత్రులుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
మాజీ మంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైలులోని జైలు నంబర్ 1లో అత్యంత భయంకరమైన నేరస్థులలో ఉంచబడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఈరోజు నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మోదీని ప్రశ్నిస్తున్నందుకే సీఎం కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. మరోవైపు మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గపడ్డాయని తెలంగాణ మంత్రులు దుయ్యబడుతున్నారు.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురు అయింది. రోస్ ఎవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానం మరో రెండు రోజుల పాటు సిసోడియా కస్టడీని పొడగించింది. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరడంతో మార్చి 6 వరకు కస్టడీని పొడగించారు. సీబీఐ మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు 2 రోజుల కస్టడీ మాత్రమే పొడగించింది. మరోవైపు ఆయన…