Arvind Kejriwal: ఢిల్లీ మద్యంపాలసీలో ఎలాంటి తప్పు లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని, అందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని, మంచి పని జరగాలని ప్రధాని కోరుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన మంచి పనిని ఆపడానికే తన క్యాబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్‌లను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో ఆప్‌పై దాడి చేసేందుకు బీజేపీ సరికొత్తగా బాహుబలి చిత్రంలోని కొన్ని క్లిప్‌లను వినియోగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆదివారం సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం 8 గంటల విచారణ తర్వాత సీబీఐ అధికారులు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. తాజాగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం అరెస్ట్ చేసింది. సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసులో సిసోడియా అరెస్ట్ కు మిస్సింగ్ ఫైల్స్ కారణం అని తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ విభాగంలో సీజ్ చేసిన ఓ డిజిటల్ డివైస్ సిసోడియా పాత్రను బయటపెట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో గతేడాది ఆగస్టు 19న సీబీఐ సోదాలు చేసింది. అయితే ఈ సమయంలో…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా అరెస్ట్‌పై స్పందిస్తూ 'డర్టీ పాలిటిక్స్' అని మండిపడ్డారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో నమోదు అయిన ఛార్జీషీట్ లో సిసోడియా పేరు కూడా ఉంది. అయితే గత ఆదివారమే సీబీఐ ముందు సిసోడియా హాజరుకావాాల్సి ఉన్నా, విచారణకు మరింత సమయం కోరారు. తాను బడ్జెట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని అందుకే మరింత గడువు కావాలని కోరారు. దీంతో ఈ రోజు విచారణకు హాజరుకాబోతున్నారు.
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది.
AAP councillor Pawan Sehrawat joins BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ కు చెందిన కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ గూటికి చేరారు. సెహ్రావత్ బవానా వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నిమిషాల ముందు ఈ ప్రకటన వెలువడింది. బీజేపీలోకి చేరిన తర్వాత ఆప్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్…