PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు కొందరు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో వేల సంఖ్యలో మోదీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లు వెలిశాయి. ‘‘ మోదీ హటావో-దేశ్ బచావో’’ అంటూ పోస్టర్లపై రాతలు ఉన్నాయి. వీటిపై పోలీసులు 44 కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది.
Read Also: Kadapa Muslim Bhakthulu: దేవునికి కడపలో ముస్లింల ఉగాది వేడుకలు
పలు చోట్ల దాదాపుగా 2,000 మోదీ వ్యతిరేక పోస్టర్లను పోలీసులు తొలగించారు. పోస్టర్లలో ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంతో డీఫేస్ మెంట్ అండ్ ప్రెస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యాన్ ను అడ్డగించిన పోలీసులు అందులో పోస్టర్లను గుర్తించారు. పోస్టర్లను ఆప్ ప్రధాన కార్యాలయానికి అందచేస్తున్న వ్యాన్ డ్రైవర్ పోలీసులకు వెల్లడించారు. సోమవారం కూడా ఇదే విధంగా పోస్టర్లను అందించినట్లు ఒప్పుకున్నాడు.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కేసులు పెట్టడాన్ని ప్రశ్నించింది. పోస్టర్లలో అభ్యంతరం ఏముందని ఓ ట్వీట్ లో అడిగింది. ఇది మోదీ నియంతృత్వానికి పరాకాష్ట అని ఆప్ పేర్కొంది. మొత్తం 50,000 ‘‘మోదీ హటావో-దేశ్ బచావో’’ పోస్టర్లను ముద్రించాలని తమకు ఆర్డర్ వచ్చిందని అరెస్ట్ అయిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. పోస్టర్లలో ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంతో యజమానులను అరెస్ట్ చేశారు.