గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ ఇటాలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గోపాల్ ఇటాలియాను సూరత్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసింది. దాదాపుగా 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సీఆర్పీసీ 161 కింద లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడు పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 'మీ డిగ్రీని చూపించు' ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాజకీయ నాయకులను కూడా అదే చేయాలని కోరింది.
Parineeti Chopra : అపరిమిత అందంతో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పరిణీతి చోప్రా. పన్నెండేండ్ల కెరీర్లో పలు హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
Ajit Pawar comments on Modi's degree: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిగ్రీపై ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ డిగ్రీలను బహిర్గత పరచాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు జరిమానా కూడా విధించింది. చదువులేని ప్రధాని దేశానికి ప్రమాదం అంటూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మరోవైపు దేశంలోని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మోదీ డిగ్రీ చూపించాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
PM Narendra Modi: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని పలు ప్రాంతాల్లో ‘‘మోదీ హఠావో-దేశ్ బచావో’’ వ్యాఖ్యలతో పోస్టర్లను అంటించారు ఆప్ కార్యకర్తలు. దేశవ్యాప్తంగా పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించిన రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టర్లు అంటించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారు తమ పార్టీ కార్యకర్తలే అని గుజరాత్ ఆప్ చీఫ్…
PM Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. ఆ సమాచారం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ వివరాలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించింది. కేజ్రీవాల్ నాలుగు వారాల్లో గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డబ్బును…
Covid-19: దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. గత నెల వరకు వందల్లో ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది. మరోవైపు ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య పెరగడంపై అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిాంచారు. పెరుగుతున్న కేసులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోవిడ్ పెరుగుదలపై ఢిల్లీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా…