ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత 9 ఏళ్లుగా చైనా భారత్‌పై కన్నేసిందని.. అయితే ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని విమర్శించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. భారతదేశం "విశ్వగురువు"గా మారాలంటే ప్రజలు సామరస్యంగా జీవించాలని.. మంచి విద్య, వైద్య సదుపాయాలు మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాపై ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా.. నేడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. రాజ్యసభలో కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు.
Liquor shops Closed: మద్యం ప్రియులకు చేదు వార్త. రాబోయే పండుగల కోసం ఢిల్లీ ప్రభుత్వం 4 డ్రై డేలను ప్రకటించింది. మొహర్రం, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, ఈద్-ఎ-మిలాద్ నాడు ఢిల్లీలో మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ప్రభుత్వం తెలిపింది.
Election Survey: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా దేశంలో రాజకీయ వేడి పెరిగింది. రెండు పెద్ద కూటముల మధ్య ఆసక్తికర పోటీకి జనం కూడా సిద్ధమయ్యారు.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.