దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.
గుజరాత్‌కు చెందిన కీలక గిరిజన నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు.
పంజాబ్‌లోని మోగాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆప్ పార్టీకి మేయర్ పదవి దక్కింది. మంగళవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ విజయం సాధించగా, కాంగ్రెస్‌కు చెందిన నితికా భల్లాను మేయర్ పదవి నుంచి తప్పించారు.
మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణం చేసిందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. ఇది వందల కోట్ల కుంభకోణమని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. మద్యం, విద్య, హవాలా వంటి కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.
Adipurush: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’పై పలు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆదిపురుష్ లోని కొన్ని డైలాగ్స్ అత్యంత అభ్యంతరకరంగా, తక్కువ గ్రేడ్ చిత్రాల్లోని డైలాగ్స్ లా ఉన్నాయని ఆరోపించింది. ఈ సినిమాకు బీజేపీ మద్దతు ఉందని దుయ్యబట్టింది.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విపక్షాల ఐక్యత గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడకుంటే.. తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఆప్ గురువారం ఆరోపించింది.
AAP: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ముమ్మరం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యకతిరేకంగా దేశ రాజధానిలోని రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహిస్తుంది.