దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు పొందేందుకు AAP చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా సీఎం కేజ్రీవాల్ రేపు అఖిలేష్ తో భేటీకానున్నారు.
Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజధాని హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.
Satyendar Jain: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం మధ్య, మే 28న జరగాల్సిన వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రకటించింది. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ఈ వార్తను ధృవీకరించారు. కాగా, రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
Centre vs AAP: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ‘పవర్ వార్’ కొనసాగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో అధికారాలు ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉండాలని కీలక తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అధికారాలకు కత్తెర వేస్తూ.. కొత్తగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది.
Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై దృష్టిసారించారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీస్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్, అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఈ రోజుతో కస్టడీ ముగియడంతో మనీస్ సిసోడియాను సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధిష్టించింది. ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఈరోజు ఢిల్లీ మేయర్‌గా తిరిగి ఎన్నికయ్యారు