IVF Case: దివంగత పాప్ సింగర్ సిద్ధు మూసేవాలా తల్లి ఇటీవల ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది. అయితే, 21-50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు మాత్రమే ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అర్హులనే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిద్దూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ వయసు 58 ఏళ్లు. మే 29, 2022లో పంజాబ్ మాన్సాలో 28 ఏళ్ల సిద్దూ మూసేవాలా హత్యకు గురయ్యారు.…
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు.
BJP: 2024 లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలు రూపొందిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాలను క్రాస్ చేస్తుందని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో ఆప్‌తో బీజేపీ పోటీ పడబోతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో అభ్యర్థుల విషయంలో బీజేపీ కీలకంగా…
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
Delhi Budget 2024: ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి సోమవారం (మార్చి 4) కేజ్రీవాల్ ప్రభుత్వ 10వ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్లో విద్యకు రూ.16,396 కోట్లు కేటాయించారు.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మద్యం కుంభకోణంలో ఈరోజు హాజరు కావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.
Political parties income: కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఆదాయం పరంగా టాప్ ప్లేస్‌లో ఉంది. దేశంలో ఉన్న 6 జాతీయ పార్టీల ఆదాయాలను బట్టి చూస్తే ఎవరికి అందనంత ఎత్తులో కాషాయ పార్టీ నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 జాతీయ పార్టీలకు రూ. 3077 కోట్ల ఆదాయం వస్తే.. బీజేపీ ఏకంగా 76.77 శాతంతో రూ. 2361 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఉటంకిస్తూ..…
దేశ రాజధాని ఢిల్లీ ఆప్‌కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి.