ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. కేజ్రీవాల్ దాదాపు 8.5 కిలోల బరువు తగ్గారని.. అలాగే బ్లడ్ షుగర్ కూడా 50 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా పడిపోయిందని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. దీంతో ఆప్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Kuppam: మారనున్న కుప్పం రూపురేఖలు.. సీఎం ఆదేశాలతో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు..!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఆ మధ్యలో ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టుకు వెళ్లి అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఇటీవల ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే కేజ్రీవాల్ మగ్గుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రం 21 రోజులు సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: MAA Action: నటీనటుల అసభ్యకర వీడియోలు.. ఐదు యూట్యూబ్ ఛానల్స్ లేపేసిన ‘మా’
శనివారం సంజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను తీవ్రమైన వ్యాధితో బాధపెట్టడానికి కుట్ర పన్నుతోందని.. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినప్పుడు కేజ్రీవాల్ బరువు 70 కిలోలు అని, ప్రస్తుతం బరువు 61.5 కిలోలకు తగ్గిందని సంజయ్‌సింగ్ చెప్పారు. ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే కేజ్రీవాల్ బరువు తగ్గడానికి కారణమని పేర్కొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో అరెస్టు అయినందున కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారని వెల్లడించారు. సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించవచ్చన్న దురుద్దేశంతోనే సీబీఐ కేజ్రీవాల్‌పై కల్పిత కేసు పెట్టిందని.. ఇదంతా ఆయన జీవితంతో ఆడుకోవడం కోసమేనని సంజయ్ సింగ్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Wife Pours Boiling Oil: నిద్రిస్తున్న భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య.. కారణం ఏంటంటే..