Manish Sisodia: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోదియా సంచలన కామెంట్స్ చేశారు. తాను తిహాడ్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు సీఎం పదవిని ఆఫర్ చేసింది.. ఈ ఆఫర్ ను నిరాకరిస్తే ఎక్కువ కాలం కటకటాల వెనుక ఉంచుతామని భారతీయ జనతా పార్టీ బెదిరించిందని అతడు ఆరోపించారు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్!
ఇక, కమలం పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీపై చేసిన కుట్రలను ఇప్పుడు బయట పెడుతున్నాను అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఇదే వారి విధానం.. ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తారని తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను టార్గెట్ గా చేసుకుంటారు.. వాళ్ల మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని ఆరోపించారు. స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో కమలం పార్టీకి పట్టింపు లేదన్నారు. కేవలం అధికారం కోసమే వారు ఆరాటపడుతారని సిసోడియా దుయ్యబట్టారు.
Read Also: Crime News: తండ్రిని కడతేర్చిన తనయుడు.. గొంతు కోసి హత్య
అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా 2023లో అరెస్ట్ అయ్యారు. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించారు. కాగా, గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్‌పురా నుంచి సిసోడియా పోటీ చేస్తున్నారు. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 8న తుది ఫలితాలను ప్రకటించనున్నారు.