Congress: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. రూ. 382 కోట్ల విలువైన హెల్త్ కుంభకోణంలో కేజ్రీవాల్‌కి సంబంధం ఉందని ఆరోపించింది. ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ బుధవారం మాట్లాడుతూ.. కాగ్ నివేదిక కేజ్రీవాల్ నిర్వహించిన ఆరోగ్య సంబంధిత కుంభకోణాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. అవినీతిపై పోరాడుతానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆయనే అవితీని చేసినట్లు కాగ్ వెల్లడించిందని అన్నారు.
Read Also: Katchatheevu: “కచ్చతీవు”పై ఇందిరా గాంధీని ప్రశంసించిన కాంగ్రెస్.. అన్నామలై తీవ్ర విమర్శలు..
మూడు ఆస్పత్రుల అదనపు ఖర్చులను ప్రవేశపెట్టకుండా కేజ్రీవాల్ అడ్డకున్నారని మాకెన్ ఆరోపించారు. కాగ్ నివేదికలో మూడు ఆస్పత్రుల టెండర్ల కన్నా రూ. 382 కోట్లు ఎక్కువ ఖర్చు చేశారని చూపించిందని, శాసనసభలో కాగ్ నివేదిక సమర్పించడానికి కేజ్రీవాల్ అనుమతి కూడా ఇవ్వలేదని, ఈ స్కామ్ వెలుగులోకి వస్తుందనే ఇలా చేశారని మాకెన్ సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పాలన సమయంలో ఈ ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభమైందని, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్మాణాలను జాప్యం చేసిందని మాకెన్ చెప్పారు. గత 10 ఏళ్ల ఆప్ పాలనా కాలంలోని ఆస్పత్రుల నిర్మాణం పూర్తైందని కాగ్ చెప్పిందని, ఇందిరాగాంధీ ఆస్పత్రికి అదనంగా రూ. 314 కోట్లు, బురారి ఆస్పత్రికి రూ. 41 కోట్లు, మౌలానా ఆజాద్ డెంటల్ ఆస్పత్రికి రూ. 26 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కోవిడ్-19 సమయంలో కేంద్రం అందించిన రూ. 653 కోట్ల గ్రాంట్లలో రూ. 360 కోట్లు ఖర్చు చేయలేదని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆప్ తాను ప్రకటించిన 32,000 పడకలకు బదులుగా కేవలం 1235 పడకలను మాత్రమే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2016-17 నుండి 2021-22 వరకు, నాలుగు వేర్వేరు బడ్జెట్‌లలో, వారు 32,000 మెడికల్ బెడ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు… కానీ 1,235 పడకలు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయని వెల్లడించారు.