దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 60 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. దాదాపుగా అన్ని సర్వేలు కూడా కమలం పార్టీదే అధికారం అని తేల్చేశాయి. ప్రజలు మార్పు కోరుకుంటన్నారని సర్వే అంచనాలు వేశాయి. ఇక ఆప్ ప్రకటించినట్లుగానే.. బీజేపీ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వని ఉచిత హామీలను హస్తిన వాసులకు ఇచ్చింది. దీంతో ఓటర్లు ఎక్కువుగా కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపించినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Ram Gopal Varma: రేపు పోలీసు విచారణకు రాంగోపాల్ వర్మ.. వస్తాడా..?
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి అతిషి గెలుపు కూడా సర్వేలు వచ్చాయి. అతిషి గెలుస్తారా? లేదా? అని కొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కల్కాజీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అతిషి పోటీ చేశారు. అతిషికి పోటీగా బీజేపీ నుంచి రమేష్ బిధురి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా బరిలో ఉన్నారు. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉన్నట్లుగా సర్వేలు పేర్కొన్నాయి. ఈ మేరకు యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది. అయితే అతిషికే కొంచెం ఎడ్జ్ ఉన్నట్లుగా తెలిపింది. అయితే ఈ తీవ్ర పోటీలో అతిషి గట్టెక్కవచ్చని స్పష్టం చేసింది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఫలితాలు మాత్రం ఈసారి ఆప్‌కు వ్యతిరేకంగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ శనివారమే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: MLA Anirudh Reddy : సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ సంచలన వ్యాఖ్యలు.. అందరూ షాక్..!