కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన (యూబీటి), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), జనతాదళ్ (యునైటెడ్) సహా 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.
ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోరినట్లు అధికారులు గురువారం తెలిపారు.
భారత దేశంలో ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన భారతరాష్ట్ర సమితి పార్టీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఇటీవలే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఎదురుదెబ్బ తగిలింది. 2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అక్కర్లేదని దేశంలోని కొందరు ‘దేశ వ్యతిరేకులు’ మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో 'మోదీ హటావో, దేశ్ బచావో' పోస్టర్లను వేసిన కొద్ది రోజుల తర్వాత మరో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సారి దేశవ్యాప్తంగా ఆ ప్రచారాన్ని కొనసాగించనుంది.
సీబీఐ-ఈడీ దాడులు అవినీతిపరులందరినీ ఒకే రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చాయని, కేంద్రంలో బీజేపీ పాలన ముగియగానే దేశం అవినీతి రహితంగా మారుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు.