Ambedkar Statue : దేశమంతా గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుండగా అమృత్‌సర్‌లో కొంతమంది వ్యక్తులు టౌన్ హాల్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య…
కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Delhi Election 2025: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ పై రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
CM Atishi: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సహకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్రౌడ్ ఫండింగ్ అవసరమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.40 లక్షలు అవసరమని.. అందుకోసం, రూ.100 నుండి రూ. 1000 వరకు ప్రజలు సహాయం చేయాలనీ కోరారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఇది మాకు సహాయపడుతుందని తెలిపారు. నా క్రౌడ్ ఫండింగ్ ప్రచారానికి మద్దతు ఇవ్వండని, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు తీసుకోబోమని అతిషి…
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బహిరంగంగా ప్రశంసించారు. ఒక వైపు, కేజ్రీవాల్ నితిన్ గడ్కరీని మెచ్చుకుంటూ.. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వచ్ఛమైన సిద్ధాంతం గల నాయకుడని అభివర్ణించారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతిపరులని తరచూ చెప్పే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలను ఈ విధంగా పొగిడటం చాలా అరుదు.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.