గత కొన్ని రోజులుగా బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ పేరుతో రాజకీయ పోరాటం సాగుతోంది. పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ సహా పలు రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసుకుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో 'ఆప్' కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా 'పుష్ప' తరహాలో బీజేపీపై విరుచుకుపడింది.
Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. లిక్విడ్ పోసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.
AAP First List: వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేసింది.
Kailash Gahlot: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేత కైలాశ్ గహ్లోట్ ఈ రోజు (సోమవారం) బీజేపీలో జాయిన్ అయ్యారు.
Kailash Gehlot: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్.. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం భారతీయ జనాత పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నేత కైలాష్ గెహ్లాట్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాశారు
Delhi : రాజధాని డిటిసి (ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సుల భద్రత కోసం మోహరించిన బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు సిఫార్సు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని జహంగీర్‌పురిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నిన్న నేను ఢిల్లీలోని వికాస్పురికి వెళ్లానని, అక్కడ బీజేపీ.. గూండాలను పంపి నన్ను చంపేందుకు ప్రయత్నించింది. నాపై దాడి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయండి.