ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దూకుడు పెంచింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇక, ఇవాళ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరును ప్రకటించారు.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు ఉన్న గోవాలో ఏకంగా 39 స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టి.. ప్రతిష్టాత్మకంగా…
ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాలకు ఎన్నిలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. 7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోవాలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గోవా ఓటర్లకు హామీలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో అధికారంలోకి వస్తే రూ.3 వేలు నిరుద్యోగ భృతి…
సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. బూస్టర్ డోసులిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 107 కేసులు నమోదవడంతో .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. అయితే ఇవి…
రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. అయితే, దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు.. ఇలా ఒక్కటేంటి.. అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలున్నాయి.. ఇక, అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం వింటుంటాం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇది ప్రారంభం అయిపోయిందని తెలుస్తోంది.. దీనికి కారణం ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. తాజాగా…
పంజాబ్ రాజకీయం మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. అందుకే ప్రధాన పార్టీలు వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. అధికార కాంగ్రెస్ మరోసారి పంజాబ్ పీఠమెక్కాలని ప్లానింగ్‌లో ఉంది. కెప్టెన్ అమరిందర్ సింగ్ స్థానంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీకి సిఎం పదవి కట్టబెట్టటం అందులో భాగమే. అయితే ఇది కాంగ్రెస్‌లో ఇంటిపోరు భగ్గుమంది.పీసీసీ చీఫ్ సిద్ధూ లీడర్‌షిప్‌లోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందని పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆ…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారా ? అనే అనుమానం రాజకీయ వర్గాలతో పాటు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. సోనూసూద్ ఢిల్లీ సీఎంతో భేటీ కావడం ఈ చర్చకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో సోనూసూద్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య సమావేశం జరిగింది. సోనూ సూద్, సిఎం కేజ్రీవాల్ భేటీకి రాజకీయ రంగు అద్దుతున్నారు. ఈ సమావేశాన్ని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.…
బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పరిస్థితి ఏదో చేయబోతే.. ఇంకా ఏదో అయినట్టుగా తయారైంది.. కరోనా బాధితుల కోసం ఆయన ఫాబీఫ్లూ ట్యాబెట్లను పంపిణీ చేస్తే.. అసలే ట్యాబెట్లు దొరకక కష్టాలు పడుతున్న సమయంలో.. పెద్ద ఎత్తున ఆ ట్యాబెట్లను అక్రమంగా నిల్వ చేశారని ఫిర్యాదులు అందాయి.. దీనిపై దాఖలైన పిటిషన్‌లో డ్రగ్ కంట్రోలర్ విచారణ చేపట్టి.. గౌతం గంభీర్ ఫౌండేషన్ అక్రమంగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వ చేసిందని.. ఈకేసులో గంభీర్ ఫౌండేషన్ దోషిగా…