కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్… 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన దేశాన్ని అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని, మనం ఇతరులపై ముందుగా దాడి చేయకపోయినా, మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి చేయాలన్నారు.. 2047లో మన దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుంది..…