పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు జవాన్లు అమరులైనట్లు వెల్లడించారు DGMO రాజీవ్ ఘాయ్.. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై తొలిసారి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ DGMOలు సంయుక్త మీడియా సమావేశం.. నిర్వహించారు.. అందులో DGMO రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. ఐదుగురు జవాన్లు, పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నాం.. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు అన్నారు..