నవీ ముంబైలో కిడ్నాప్ కలకలం రేపింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెరుల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నేరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.