Kidnap: ముంబైలో కిడ్నాప్ కలకలం.. 4 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవీ ముంబైలో కిడ్నాప్ కలకలం రేపింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెరుల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నేరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ వ్యక్తి చిన్నారిని తన చేతుల్లో ఎత్తుకుని వెళ్లిపోతున్నట్లు ఓ కెమెరాలో రికార్డైంది. ఆ తర్వాత నిందితుడి ఆచూకీ కోసం సీనియర్ పోలీసు అధికారి తానాజీ భగత్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం రైల్వే స్టేషన్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న 150 సీసీటీవీలను తనిఖీ చేసింది. సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి ఆ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు వల వేశారు.
Read Also: World Cup 2023: ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్.. స్వదేశానికి కెప్టెన్ బావుమా
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
నిందితుడు నవీ ముంబైలోని కరావే గ్రామ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు తండ్రి మణి థామస్ బాలికను తన ఇంట్లోనే ఉంచుకుంటున్నాడు. తన మొదటి భార్య చనిపోయిన తరువాత.. థామస్ తిరిగి వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి మళ్లీ పిల్లలు పుట్టలేదు. మరోవైపు నిందితుడు.. తనకు బిడ్డ కావాలనే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా.. తనను తీసుకుని రాష్ట్రం విడిచి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు బాలికను క్షేమంగా రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నిందితుడిపై కిడ్నాప్ అభియోగాలు నమోదు కాగా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడికి పిల్లల అక్రమ రవాణా కేసుల్లో ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!