కరోనా మహమ్మారి ఎఫెక్ట్ జనజీవనంపైనే కాకుండా సినిమా ఇండస్ట్రీపై భారీగానే పడింది. దీంతో సినీ కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు బంద్ కావడంతో వారికి పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కేజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన 21 డిపార్టుమెంటులలో పనిచేసే 3000 మంది అకౌంట్లలోకి రూ.5000 ట్రాన్స్ఫర్ చేయనున్నట్టు…