Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.
TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ సంవత్సరాల కృషి మూలంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అమెరికా భారత్‌కి అప్పగించింది.
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో 166 మంది మరణానికి కారణమైన పాక్-కెనెడియన్ ఉగ్రవాది తహవూర్ రాణాని భారత్‌కి తీసుకువచ్చారు. అమెరికా అతడిని ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం భారతీయ అధికారులు, రాణాని ఢిల్లీకి చేర్చారు. ఇతడిని ప్రశ్నించేందుకు ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి.
Tahawwur Rana: 26/11 ముంబై దాడుల ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ తహవూర్ రాణాను అమెరికా, భారత్‌కి అప్పగించింది. గురువారం భారత అధికారులు రాణాను ఇండియాకు తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత, భద్రతా అధికారులు విస్తృత భద్రతను ఏర్పాటు చేశారు. భారత్ రాకుండా అనేక పర్యాయాలు అమెరికా కోర్టుల్ని ఆశ్రయించిన రాణాను, భారత్ తీసుకురావడానికి అధికారులు చేసిన కృషి ఫలించింది. ఇదిలా ఉంటే, రాణా అప్పగింతపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ టార్గెట్‌గా…
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌ను దుర్మార్గపు ఆలోచనలను బయటపెట్టారు. న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే ఉగ్రవాదానికే బలవుతుందన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారన్నారు.
Pakistan: రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. నిజానికి టెర్రరిస్టుల్ని చూస్తే ప్రజలు భయపడాలి కానీ, పాకిస్తాన్‌లో మాత్రం బయటకు వెళ్లాలంటే ఉగ్రవాదులు భయపడి చస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్చి చంపుతారో తెలియడం లేదు. గత కొన్నేళ్లుగా ఒకే విధంగా ఉగ్రవాదుల్ని అజ్ఞాత వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ భయాన్ని రుచి చూపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వచ్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. బయటకు వెళ్తే, తిరిగి ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు అక్కడి ఉగ్రవాదుల్లో ఉన్నాయి. దీంతో కీలకమైన ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్స్ వెళ్లారు. మరికొందరికి పాక్ ఐఎస్ఐ, ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి.
Mumbai 26/11 attack: 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది, పాకిస్తాన్ కెనడియన్ అయిన తహవ్వూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. భారత్‌కి తనను అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం తలుపుతట్టాడు.
26/11 ముంబై దాడులు భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడి. పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మార్గాన ముంబై మహానగరంలోకి వచ్చి మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనకు నేటితో 15 ఏళ్లు నిండాయి. అయితే ఆ నెత్తుటి గుర్తులు ఇప్పటికీ దేశ ప్రజలను బాధిస్తున్నాయి. నరేంద్రమోడీ ఈ రోజు తన 107వ ఎడిషన్ మన్ కీ బాత్‌లో ముంబై ఉగ్రదాడిని ‘ అత్యంత భయంకరమైన ఉగ్రదాడి’ గా పేర్కొన్నారు. ‘‘ ఈ రోజు నవంబర్ 26, ఈ రోజును…