Donald Trump: తనపై అభియోగాలు మోపితే మరణాలు, విధ్వంసమే అని ట్రంప్ హెచ్చరించారు. స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ విచారణలో అభియోగాలు మోపితే బాగుండంటూ మాన్ హట్టన్ అటార్నీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ముందు పోర్న్ స్టార్ తో సంబంధాల గురించి బయటపడకుండా డబ్బులతో ప్రలోభపెట్టాడనే కేసును మాన్ హట్టన్ అటార్నీ విచారించేందుకు సిద్ధం అయిందని, తనపై అభియోగాలు మోపి రోజుల్లో అరెస్ట్ చేస్తారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు…
Nikki Haley: వచ్చే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల తరుపున భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ బరిలో నిలవనున్నారు. చెప్పకనే చెబుతూ.. ఆమె అప్పుడే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించినట్లయింది. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ చైనా చరిత్ర బూడిద కుప్పగా ముగుస్తుందంటూ విమర్శించారు. పూర్వపు సోవియట్ యూనియన్ లాగే చైనా పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.