Karnataka: 2024 లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఈ సారి మోడీని గద్దె దించవచ్చని భావిస్తున్నాయి.