జమ్మూకాశ్మీర్‌లోని బందీపోర్‌లో ఆర్మీ వాహనానికి ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కారణంగా పలు ఇళ్లు నీటిలో నానిపోయాయి. దీంతో ఒక ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బవాన్‌కులే కుమారుడు సంకేత్‌కు చెందిన ఆడి కారు నాగ్‌పూర్‌లో బీభత్సం సృష్టించింది. పలు వాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా... సాకేత్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు.
Gunfire : ఫిన్లాండ్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఒక చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఫిన్నిష్ రాజధాని వెలుపల ఉన్న పాఠశాలలో ముగ్గురు 12 ఏళ్ల పిల్లలపై కాల్పులు జరిగాయి.
ఇవాళ హోలీ పండుగ. ఈ రంగుల పండుగ లాగే జీవితం కూడా రంగుల మయంగా వుండాలని, అంతా కలిసి జరుపుకుంటారు. అయితే అక్కడక్కడా కొందరు ఆకతాయిలు, మందుబాబులు హల్ చల్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హోలీ పండుగ సందర్భంగా ఇంట్లో మద్యం సేవించి రోడ్డుపైకి నానా గొడవ చేశారు. తమ చేతిలోని మద్యం సీసాలను జనంపైన విసిరేశారు, రోడ్డు వెంట వెళ్ళే వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి…
వీకెండ్ వచ్చిందంటే చాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. మందేసి చిందేసి రోడ్లమీదకి వచ్చి మరీ అమాయక జనం ప్రాణాలు తీసేస్తున్నారు.మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం బలయింది. మొయినబాద్ నుండి చేవెళ్ల వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమిక (16) ఘటన స్థలంలోనే మృతిచెందింది. ప్రస్తుతం సౌమ్య,అక్షర గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మరో 24 గంటలు గడిస్తే…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే 1వ గనీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘటనను గోప్యంగా ఉంచారు అధికారులు. కెటికె 1 గని లో ఫస్ట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు పైన రూప్ గోడలు కూలి మీద పడ్డాయి. దీంతో కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం ఘటనలో ఒకరికి కాలు పైన నుండి దూసుకెళ్లిన ఎస్.డి.ఎల్ వాహనం. దీంతో కాలి ఎముకలు విరిగిపోయాయి. కార్మికునికి స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో…