మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బవాన్‌కులే కుమారుడు సంకేత్‌కు చెందిన ఆడి కారు నాగ్‌పూర్‌లో బీభత్సం సృష్టించింది. పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా… సాకేత్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahavir phogat: వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు.. పెద్దనాన్న మహవీర్ వ్యాఖ్య
ఆడి కారు ఫిర్యాదుదారు జితేంద్ర సోన్‌కుంబ్లే కారును ఢీకొట్టింది. అనంతరం మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. నాగ్‌పూర్‌లోని రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సీతాబుల్డి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఆడి కారు మాన్కాపూర్ ప్రాంతం వైపు వెళుతుండగా పలు వాహనాలను ఢీకొట్టింది. టీ-పాయింట్ దగ్గర మరో కారును ఢీకొట్టింది. అందులో ఉన్నవారు ఆడిని వెంబడించి మాన్కాపూర్ బ్రిడ్జి దగ్గర ఆపారు. సంకేత్ బవాన్‌కులేతో సహా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. కారు డ్రైవర్ అర్జున్ హవ్రే మరియు మరో వ్యక్తి రోనిత్ చిట్టమ్‌వార్‌ను పోలో కారులో ఉన్నవారు ఆపారు. వారిని తహసీల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తదుపరి విచారణ కోసం సీతాబుల్డి పోలీసులకు అప్పగించారు’’ అని అధికారి చెప్పాడు.
ఇది కూడా చదవండి: Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ తరపున కీలక ప్రతిపాదనలు
సంఘటన జరిగినప్పుడు ఆడిలోని వ్యక్తులు ధరంపేత్‌లోని బీర్ బార్ నుంచి తిరిగి వస్తున్నారని.. అయితే వారిలో ఎవరైనా తాగి ఉన్నారా అనే దానిపై సమాచారం ఇవ్వలేదని అధికారి తెలిపారు. ‘‘సోన్‌కాంబ్లే ఫిర్యాదుపై ర్యాష్ డ్రైవింగ్ మరియు ఇతర నేరాల కింద కేసు నమోదైంది. హవ్రే మరియు చిట్టమ్‌వార్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని సీతాబుల్డి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే మాట్లాడుతూ.. ఆడి కారు తన కుమారుడు సంకేత్ పేరిట రిజిస్టర్ అయినట్లు అంగీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా క్షుణ్ణంగా మరియు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. దోషులుగా తేలిన వారిపై అభియోగాలు మోపాలని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాను ఏ పోలీసు అధికారితో మాట్లాడలేదని.. చట్టం అందరికీ సమానంగా ఉండాలని బవాన్‌కులే అన్నారు.
ఇది కూడా చదవండి: Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ తరపున కీలక ప్రతిపాదనలు