దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
ముస్లిం యువతుల వివాహాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొంది. 21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం దంపతుల రక్షణ పిటిషన్‌ను జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ధర్మాసనం విచారిస్తూ ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ బేడి షరియా…