Gold Smuggling: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలోని గల భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో మంగళవారం నాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది భారీ బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఢాక నుంచి భారతదేశానికి తీసుకు వస్తున్న రూ.1.48 కోట్ల విలువైన బంగారు కడ్డీలను 32వ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ అధికారులు అరెస్టు చేశారు.