Gold Smuggling: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలోని గల భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో మంగళవారం నాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది భారీ బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఢాక నుంచి భారతదేశానికి తీసుకు వస్తున్న రూ.1.48 కోట్ల విలువైన బంగారు కడ్డీలను 32వ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి నుంచి 1,48,93,575 రూపాయల విలువైన 1.745 కిలోల బరువున్న దాదాపు 10 బంగారు కడ్డీలు, ఒక చిన్న విలువైన పసుపు లోహపు ముక్కను స్వాధీనం చేసుకుంది.
Read Also: HYDRA: జగద్గిరిగుట్టలో హైడ్రా దూకుడు.. ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు
అలాగే, ఫిబ్రవరి 18వ తేదీన నదియా జిల్లాలోని బన్పూర్ గ్రామం నుంచి స్మగ్లర్ల ముఠా బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన అధికారులు బాన్‌పూర్ సరిహద్దు ప్రాంతం వెంబడి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఇక, బాన్పూర్ లోని ఫుల్బరి సరిహద్దు గ్రామం నుంచి ఒక అనుమానిత భారతీయ స్మగ్లర్ వస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అతడి అంతర్జాతీయ సరిహద్దు వద్దకు చేరుకుని బంగ్లాదేశ్ వైపు నుంచి విసిరిన రెండు ప్యాకెట్లను తీసుకుని వెళ్తుండగా.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక, సదరు స్మగ్లర్ దగ్గర నుంచి బంగారం స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు బీఎస్ఎఫ్ సిబ్బంది అప్పగించింది. అక్రమ రవాణా, చొరబాట్లను నిరోధించడానికి నిరంతరం బీఎస్ఎఫ్ సిబ్బంది గస్తీ కాస్తూ.. కఠినమైన చర్యలు తీసుకుంటోంది అని BSF దక్షిణ బెంగాల్ సరిహద్దు డీఐజీ, ప్రజా సంబంధాల అధికారి NK పాండే పేర్కొన్నారు.