Story Board: కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ మందగమనంలోనే ఉంది. ఇప్పటికీ పరిస్థితి మారలేదని అన్ రాక్ నివేదిక తేల్చేసింది. కాకపోతే ఈ సమస్య ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాలేదు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఇదే పరిస్థితి ఉంది. అందరూ అనుకుంటున్నట్టుగా అధిక ధరలే రియల్ మాంద్యానికి కారణమని తేలిపోయింది.
Read Also: NIA: విజయనగరం ఉగ్రకుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ!
దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. అలాంటి రియల్ ఎస్టేట్ ను కరోనా గట్టి దెబ్బ కొట్టింది. కానీ కరోనా తర్వాతి ఏడాది రియల్ బూమ్ కనిపించిది. కానీ ఆ తర్వాత నుంచీ మందగమనమే కొనసాగుతోంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయని రియల్టర్లు ఎదురుచూడటమే కానీ.. మార్కెట్ మాత్రం స్తబ్ధుగానే ఉంది. ఏళ్లు గడుస్తున్నాయి కానీ.. రియల్ ఎస్టేట్ మాత్రం పుంజుకోవడం లేదు. హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయని.. ఇదే సమయంలో విక్రయాలు 20 శాతం తగ్గాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2024 ఏప్రిల్-జూన్‌లో 1,20,335 ఇళ్లు విక్రయం కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 96,285 మాత్రమే అమ్ముడయ్యాయని తెలిపింది. హైదరాబాద్, దిల్లీ-ఎన్సీఆర్, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, పుణె, కోల్‌కతా నగరాల్లో గృహ విక్రయాలు తగ్గాయి.
Read Also: Trump: అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు.. చాలా ప్రమాదకరం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య చోటుచేసుకున్న యుద్ధాల వల్ల కొనుగోలుదార్ల సెంటిమెంటు దెబ్బతింది. ఇల్లు కొనేందుకు వేచి చూసే ధోరణి అవలంబించారు. గత రెండేళ్లలో ఇళ్ల ధరలు భారీగా పెరగడమూ ప్రభావం చూపింది. మన దేశం కూడా పాకిస్తాన్ తో యుద్ధానికి దిగిన స్థితిలో.. రియల్ ఎస్టేట్ అంటేనే సామాన్యులు ఆమడదూరం జరుగుతున్నారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి.. సాఫ్ట్ వేర్ రంగంలో లేఆఫ్ లు ఇళ్లు కొనే ధైర్యాన్ని ఇవ్వడం లేదు. పరిస్థితులు బాగాలేనప్పుడు లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంచుకుంటే బెటరనే భావన బలపడుతోంది. అసలు సామాన్యుల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. కొద్ది మంది దగ్గర మిగులు డబ్బున్నా.. దాన్ని స్థిరాస్తిగా మార్చుకోవడానికి వారు ధైర్యం చేయడం లేదు. దీంతో ఏతావాతా రియల్ ఎస్టేట్ ల స్తబ్ధత కనిపిస్తోంది. హైదరాబాద్‌కు నిత్యం వందల మంది ఉపాధి కోసం వస్తుంటారు. ఇలా ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అద్దెలు కట్టడానికి బదులుగా సొంతింటి కోసం ఈఎంఐలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఇళ్ల ధరలు చూసి వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతూ భయపెడుతున్నాయి. హైదరాబాద్ లో 2024 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో 15,085 ఇళ్ల విక్రయాలు జరిగగా ఈ ఏడాది 27 శాతం తగ్గి 11,040కి పరిమితమయ్యాయి.
Read Also: Swetha Suicide: టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్..
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలను దాటి కన్స్ట్రక్షన్ పెరిగింది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. నగరానికి ఇబ్బడి ముబ్బడిగా కొత్త ఉద్యోగాలు రాలేదు. కొత్త కంపెనీలు కూడా రాలేదు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల SFT ఖాళీగా పడివుంది. అపార్ట్మెంట్స్ సేల్స్ బాగా పడిపోయాయి. కొత్త కన్స్ట్రక్షన్కి సమాచారం కోసం వచ్చేవాళ్లే లేరు. అలాగని ల్యాండ్ సేల్స్ కూడా స్పీడ్‌గా ఏమీ లేవు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది. ఆసక్తి తగ్గింది. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. బిల్డర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులకు కూడా సమయానికి సొమ్ము రాక నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం నిస్తేజంగా మారింది. నిధులు సమకూర్చుకోలేకపోవడంతో లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయినట్టు గతంలో నివేదికలు వచ్చాయి. ఇలా మధ్యలోనే నిలిచిపోయిన ప్రాజెక్టుల విలువ కూడా లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ రుణాలను నిరర్థక ఆస్తులుగా ఎక్కడ ప్రకటిస్తారేమోనని భయపడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు..
గతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీలాంచ్‌లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉంది. హైదరాబాద్ లో టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది. కానీ చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ సంక్షోభంలో పడ్డాయి. అయితే కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతూనే ఉందనే మాట నిజం. ఇవన్నీ గతంలో జరిగిన ఒప్పందాల మేరకు కడుతున్న నిర్మాణాలు. కానీ కొందరు బిల్డర్లు మాత్రం అసలు విషయం చెప్పకుండా.. డిమాండ్ లేకపోతే ఈ స్థాయిలో నిర్మాణాలు ఎందుక చేపడతాం అని ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. ధరల విషయంలో రాజీధోరణి ప్రదర్శిస్తూ.. వ్యాపార చక్రం సజావుగా తిరిగేలా చూసుకోవడం ఏ రంగానికైనా కీలకం. రేట్లు ఒక్కసారి తగ్గించాల్సి ఉంటుంది. ఒక్కోసారి పెంచాల్సి ఉంటుంది. కానీ ఏ సందర్భంలో అయినా.. సగటు వ్యాపార పరిమాణంలో తేడా రాకుండా చూసుకోవడమే తెలివైన వ్యాపారుల లక్షణం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లో ఈ కోణమే మిస్ అవుతోంది. వ్యాపారం కంటే రేట్లే ముఖ్యమనే ఆలోచన ఎప్పుడైతే మొగ్గతొడిగిందో.. అప్పట్నుంచే రియల్ ఎస్టేట్ తడబడుతోంది. కనీసం ఇప్పటికైనా ఆ ఆలోచన నుంచి బయటపడాలని రియల్టర్లు అనుకోవడం లేదు. అందరూ ఒకే మాటపై ఉండి.. అధిక రేట్లకే కట్టుబడితే.. కొన్నాళ్లు లేటైనా కొనకేం చేస్తారనే ధీమా కనిపిస్తోంది. కానీ అది ఎప్పటికీ జరిగే పని కాదని గత అనుభవాలు చెబుతున్నా.. రియల్టర్లు మాత్రం నేల విడిచి సాము చేస్తూనే ఉన్నారు.
Read Also: Top Headlines @9PM: టాప్ న్యూస్!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజు వేసుకుని.. ప్లాన్ చేస్తే కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. ప్రస్తుతం ఐటీలో ఏఐ ప్రభావం గట్టిగా ఉంది. దిగ్గజ కంపెనీలు కూడా లేఆఫ్ లు కొనసాగిస్తున్నాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు.
Read Also: Swecha Votarkar: ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య!
ఏ బిజినెస్ కు అయినా డిమాండ్, సప్లై సూత్రం వర్తిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే.. రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువగా రేటు తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన సింపుల్ బిజినెస్ ట్రిక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు కూడా ఇదే సూత్రం అన్వయించొచ్చు. మొన్నటివరకు హైదరాబాద్ లో డిమాండ్ కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి.. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించేవాళ్లు బిల్డర్లు. కానీ గత మూడేళ్లుగా ఈ పరిస్థితి మారింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ మార్కెట్ స్థిరంగా ఉంది కదా అని.. డిమాండ్ ను ఎవరికి వారే ఊహించుకుని విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ శివార్లు దాటేసి.. అవుటర్ రింగ్ రోడ్డు అవతల వరకూ వెళ్లిపోయారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలతో సమానంగా అవుటర్ రింగ్ రోడ్డు అవతల కూడా కొందరు ధరలు చెప్పారు. అదేమంటే ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలని ఊదరగొట్టారు. కానీ ఇవన్నీ జనం నమ్మే పరిస్థితిలో లేరు. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ కొనాలంటే ఆస్తులు కుదవ పెట్టి కొనే పరిస్థితిని బిల్డర్లు తెచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి స్క్వేర్ ఫీట్ ధరను 300 నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచడం.. వాటి పై జీఎస్టీ, ఎమినిటీ చార్జెస్, మెయింటనెన్సన్ చార్జీలు అదనంగా వడ్డిస్తుండడంతో హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనాలంటేనే భయపడుతున్నారు కొనుగోలుదారులు.