గతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీలాంచ్‌లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉంది. హైదరాబాద్ లో టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది.