Kingdom : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్ మెరిసింది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్న కింగ్ డమ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ కు ఈ మూవీ టీమ్ వెళ్లింది.
Read Also : Kingdom : కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో.. ఎవరతను..?
విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ బోర్సే, నాగవంశీ వెళ్లి కలిశారు. వీరు దిగిన గ్రూప్ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు శ్రీలీల కూడా ఉన్నారు. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్లాక్ కలర్ సూట్ లో ఆయన షార్ప్ గా ఉన్నారు. చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇందులో శ్రీలీల రెడ్ కలర్ చీరలో ఆకట్టుకుంటున్నారు. కింగ్ డమ్ మూవీకి పవన్ కల్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Read Also : Kingdom : నెపోటిజం తప్పు కాదు.. విజయ్ కామెంట్స్