ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్ – ఫకిస్ర్త జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో పాకిస్త జట్టుకు రోహిత్ శర్మ, బుమ్రా ల కారణంగా ముప్పు ఉందని అన్నారు. అయితే రెండు జట్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు మహ్మద్ రిజ్వాన్ తమ తమ జట్లకు “మ్యాచ్ విన్నర్లు” కాగలరని అన్నారు. ఇక విరాట్ కోహ్లి మరియు బాబర్ ఆజమ్ ఇద్దరు బాగా ఆడుతారు కానీ ఈ ఓపెనర్లు ఇద్దరు మ్యాచ్ ను ఎటువైపు అయిన మలుపు తిప్పగలరు అని పేర్కొన్నాడు. అలాగే రేంజు జట్లలో పేసర్లు అద్భుతంగా ఉన్నారు. కానీ భారత పేసర్ బుమ్రా పాకిస్త జట్టుకు కీలక ముప్పు అని పేర్కొన్నాడు. బుమ్రా గత కొన్ని నెలలుగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. కాబటి అతనితో పాక్ ఆటగాళ్లు కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు.