నిన్న భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టుకు మనది ఆరంభం లభించలేదు. దాంతో ఎక్కువ పరుగులు చేయలేక పోయిన టీం ఇండియా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. దాంతో అతని పై భారీగా విమర్శలు వచ్చాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ కోహ్లీని.. వామప్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్ బదులు రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవడం వల్ల బాధపడుతున్నారా… ఏ ఏమచ్ లో ఇషాన్ ఉంటె రోహిత్ కంటే బాగా ఆడేవాడు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్న విన్న తర్వాత నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ… మీరు టీ20 మ్యాచ్ నుండి రోహిత్ శర్మను తీసేయగలరా.. అతను ఆసీస్ పై వామప్ మ్యాచ్ లో ఎలా ఆడారో చూసారా… ఇదేం ప్రశ్న. మీకు ఇవాదాస్పదమైన వ్యాఖ్యలు… సమాధానాలు కావాలంటే ముందే నాకు చెప్పండి. ఇక నుండి అలాగే చెప్తా అంటూ కౌంటర్ ఇచ్చాడు.