Virat Kohli: ఫామ్‌లో లేకపోయినా అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్‌లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు కోహ్లీ 83 మ్యాచ్‌ల్లో 3564 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్క సెంచరీ చేయకపోయినా కోహ్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ జాబితాలో రోహిత్ శర్మ 70 మ్యాచ్‌ల్లో 3,318 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 75 మ్యాచ్‌ల్లో 2,593 పరుగులు చేసి మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ 57 మ్యాచ్‌ల్లో 2,524 నాలుగో స్థానంలో ఉన్నారు.
Read Also: IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి..!!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
2019లో 44 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 64.60 సగటుతో 2455 పరుగులు సాధించాడు. అయితే వీటిలో అత్యధిక పరుగులు ప్రపంచకప్ ముందు చేసినవే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 7 శతకాలు కూడా ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాతే కోహ్లీ ప్రదర్శన మసకబారింది. అటు 2020లో 22 ఇన్నింగ్స్‌ల్లో 36.60 సగటుతో 842 పరుగులు, 2021లో 24 ఇన్నింగ్స్‌లు ఆడి 37.07 సగటుతో 964 పరుగులు, 2022లో 16 ఇన్నింగ్స్‌ల్లో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. మూడేళ్లుగా కోహ్లీ ప్రదర్శన కారణంగా అతడి మొత్తం సగటు కూడా తగ్గుతూ వస్తోంది. ఐసీసీ ర్యాంకుల్లోనూ నెమ్మదిగా కోహ్లీ తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. అయితే విరాట్ ఒక్క భారీ ఇన్నింగ్స్‌తో శతకాల బాట పడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీకి సెలెక్టర్లు విరామం ఇచ్చారు. ఆగస్టులో జరిగే ఆసియా కప్ లేదా దానికి ముందు జరిగే జింబాబ్వే సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!