టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల వివాహమై నాలుగు వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భావోద్వేగంతో ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నాలుగేళ్లుగా నేను వేసిన సిల్లీ జోకులను, నా బద్ధకాన్ని భరించావు. నేను ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావు. నాలుగేళ్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా వృద్ధి చెందావు. గత నాలుగేళ్లలో నాలో…