Kohli New Record: భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లోనే రానుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఘనతను కోహ్లీ న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో సాధించే అవకాశం మెండుగా ఉంది. అయితే, టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్నారు. జనవరి 11వ తేదీన కివీస్ తో జరిగే తొలి వన్డేలో మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు.
Read Also: Health Risks of Eating Junk Food : రోజూ సాయంత్రం జంక్ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా..
28,000 పరుగుల మైలురాయికి చేరువలో కోహ్లీ..
అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే, ఇంటర్ నేషనల్ క్రికెట్ చరిత్రలో 28 వేల పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలవనున్నాడు. మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌ల్లోనే 28,000 పరుగుల మైలురాయిని చేరుకొగా.. రెండో స్థానంలో శ్రీలంక దిగ్గజ బ్యాటర్ కుమార సంగక్కర మాత్రం తన చివరి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌తోనే ఈ ఘనత సాధించాడు. కాగా ప్రస్తుతం 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులను కోహ్లీ చేశాడు. మరో 25 పరుగులు చేస్తే, సచిన్ తర్వాత అతి వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.
Read Also: Jalsa vs Murari: న్యూ ఇయర్ ఈవ్‌కి జల్సా, మురారి రీరిలీజ్ క్లాష్.. ఫ్యాన్స్ సందడి మాములుగా లేదుగా..!
ఈ జాబితాలో ఉన్నవారు:
సచిన్ టెండూల్కర్ – 782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు
కుమార్ సంగక్కర – 666 ఇన్నింగ్స్‌ల్లో 28,016 పరుగులు
విరాట్ కోహ్లీ- ప్రస్తుతం 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు
విరాట్ కోహ్లీ కెరీర్ గణాంకాలు
వన్డేలు
మ్యాచ్‌లు: 308
పరుగులు: 14,557
శతకాలు: 53
అర్ధశతకాలు: 76
వన్డేల్లో 10,000 పరుగులు చేసిన ఆటగాడు రికార్డు కోహ్లీ పేరిటే ఉంది
టెస్టులు
మ్యాచ్‌లు: 123
పరుగులు: 9,230
టెస్ట్ కెరీర్ ప్రారంభం: 2011
టెస్ట్ రిటైర్మెంట్: మే 2025
భారత టెస్ట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా కోహ్లీ నిలిచారు. కేవలం 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించిన సారథిగా కోహ్లీ కొనసాగుతున్నారు.
టీ20 ఇంటర్నేషనల్స్:
మ్యాచ్‌లు: 125
పరుగులు: 4,188
శతకాలు: 1
అర్ధశతకాలు: 38
2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఫార్మాట్‌కు గుడ్‌బై. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అభిమానుల ఎదురుచూపులు
సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్‌లో మరో చరిత్రాత్మక ఘట్టాన్ని విరాట్ కోహ్లీ సృష్టించబోతున్నాడని తెలియడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చే ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుంది.. క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణాధ్యాయం రాయడానికి అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు..!