ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో దానిని వాయిదా వేశారు. భారత్ లో ఇంకా క్రోనా కేసులు తగ్గకపోవడంతో ఇప్పుడు ఆ సీజన్ సెకండ్ హాఫ్ ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక యూఏఈ లో నిర్వహిస్తున్న అక్కడి ఐపీఎల్ మ్యాచ్ లకు అక్కడి ప్రభుత్వం అభిమానులను అనుమతి ఇచ్చింది. కానీ స్టేడియంలోకి వచ్చే అభిమానులు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని నియమం పెట్టింది. స్టేడియం పూర్తి సామర్ధ్యం మేరకు టికెట్లను విక్రయించవచ్చు అని తెలిపింది. అయితే ఈ సెకండ్ హాఫ్ లో మొదటి మ్యాచ్ ప్రారంభానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో… మ్యాచ్ టికెట్లను ఇప్పటికే ఆన్లైన్ లో పెట్టారు అక్కడి నిర్వాహకులు.చూడాలి… మరి ఈ అభిమానులను అనుమతించడం కారణంగా మళ్ళీ ఏదైనా సమస్య వస్తుందా.. లేదా ఐపీఎల్ 2020 మాదిరిగా ఏ సమస్య లేకుండా సీజన్ ముగుస్తుందా అనేది.