Team india: మరో మూడు పర్యటనలకు బీసీసీఐ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్.. గురువారం నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును టీమిండియా ఈసారి ఆడనుంది. అదే సమయంలో ఐర్లాండ్‌తో ఒక టీ20 మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు టీమిండియా వెళ్లనుంది. అనంతరం యూఏఈలో జరిగే ఆసియా కప్‌లో భారత్ పాల్గొంటుంది. కాగా టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా రెండు బృందాలను తయారుచేయాలని బీసీసీఐ భావిస్తోంది. గత ఏడాది కూడా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో మరో టీమ్‌ను ధావన్ నేతృత్వంలో శ్రీలంక పర్యటనకు పంపిన విషయం తెలిసిందే.
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
- Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం