TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG20 League 2026: రోహిత్ రాయుడు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో TG20 లీగ్-2026లో పాలమూరు స్ట్రైకర్స్ జట్టు ఘన విజయం సాధించింది. జూన్ 25 రాత్రి జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మెదక్ ఫాల్కన్స్‌పై పాలమూరు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జట్టులో విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం చెరో 36 పరుగులతో రాణించి మెదక్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. మిగతా బ్యాటర్లలో నమన్ అగర్వాల్ (21), శృంజిత్ రెడ్డి (19), రవితేజ (13), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ అవుట్) ఫర్వాలేదనిపించారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషభ్ చెరో రెండు వికెట్లతో మెదక్‌ను కట్టడి చేయగా.. మహ్మద్ అఫ్రిది, బుడిది తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ తీశారు.
అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్ రాయుడు (54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో అద్భుతంగా ఆదుకున్నాడు. అతనికి విఘ్నేష్ రెడ్డి (39), బుడిది తేజ (23) చక్కటి సహకారం అందించారు. చివర్లో ప్రతీక్ పవార్ (27 నాటౌట్) వేగంగా ఆడటంతో పాలమూరు మరో 13 బంతులు మిగిలి ఉండగానే, అంటే 17.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెదక్ బౌలర్లలో వరుణ్ యెర్రం రెండు వికెట్లు పడగొట్టగా.. రవితేజ, ఘాజీ అబ్బాస్, శృంజిత్ రెడ్డి చెరో వికెట్ దక్కించుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!