టీమిండియాపై ఇంకా ఆగని ట్రోల్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ పేస్‌కు ఈ ఇద్దరు విలవిలలాడారు. ఒత్తిడికి చిత్తయిన ఈ జోడీ ఆరంభంలోనే వికెట్లను పారేసుకొని వెనుదిరిగారు. దాంతో ఈ ఇద్దరిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ వడపావ్ తినాలని ఒకరంటే.. నట్టేట ముంచేసాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదని, తన ఆటతో తీవ్రంగా హర్ట్ అయ్యామని కామెంట్ చేస్తున్నారు.
ఇక కోహ్లీ సింగిల్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడంతో భారత్ గట్టెక్కిందని అంతా భావించారు. కాని జట్టుకు భారీ స్కోరును అందించలేకపోయారు. ఇక బౌలర్ల సంగతి చెప్పనవసరం లేదు. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా పాకిస్థాన్ ఓపెనర్ల ముందు తేలిపోయారు.
ఉదయం గౌతమ్ గంభీర్ ట్వీట్ చేసినప్పుడే మ్యాచ్ ఓడిపోతుందని డౌట్ వచ్చిందన్నారు అభిమానులు. గంభీర్ ట్వీట్‌పై మీమ్స్ పేల్చారు. ఇక ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతేనే కప్ కొడతామంటూ కవర్ చేస్తూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు దృశ్యం గుర్తు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు. పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ జరగలేదని.. ఎవరడిగినా అదే చెప్పాలంటూ వెంకీ మామా డైలాగ్‌తో టీమిండియాకు చురకలంటించారు.
బయటే కాదు.. స్టేడియం లోపల కూడా అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా అభిమానులను స్టేడియంలోనే ఆటపట్టించారు పాకిస్థాన్ ఫ్యాన్స్. ఇండియా ఓడిపోయిందని మొహం మీద పదే పదే చెప్పడంతో స్టేడియంలో టీమిండియా సపోర్టర్స్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు.
తాజావార్తలు
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?