క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్‌లో కేఎల్…