Pakistan cricketer Haris Rauf : 2024 టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన ఫలితంగా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్టి ప్రపంచ కప్ పర్యటన ముగిసిన తర్వాత కూడా, కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ళు ఇంటికి వెళ్లకుండా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ (Haris Rauf) తన భార్యతో కలిసి అమెరికా (USA) పర్యటనకు వెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు అతడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nindha: కాండ్రకోట మిస్టరీనే ‘నింద’.. అస్సలు పోలిక ఉండదు: వరుణ్ సందేశ్ ఇంటర్వ్యూ
తన భార్యతో కలిసి బయటకు వెళ్లిన హరీస్ రవూఫ్‌ను అభిమానులు అసభ్యకరంగా తిట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీనిపై పాక్ క్రికెటర్ కూడా ఘాటుగా స్పందించాడు. తాను క్రికెటర్ అనే విషయాన్ని మర్చిపోయి ఓ అభిమానిపై దాడికి యత్నించాడు. ఈ విషయాన్ని భార్యకు చెప్పినా శాంతించకపోవడంతో ఫ్యాన్ పై దాడికి పాల్పడ్డానికి ప్రయత్నించాడు. వీడియోలో, ఆ వ్యక్తి భారతదేశానికి చెందిన అభిమాని అని హారిస్ చెప్పాడు. అయితే ప్రశ్నించిన వ్యక్తి తాను పాకిస్థాన్‌కు చెందినవాడినని చెప్పాడు.
Pinarayi Vijayan: కేరళ సీఎంకు హైకోర్టు షాక్.. కుమార్తెతో సహా నోటీసులు జారీ..
హరీస్ రవూఫ్ కోపాన్ని అతని భార్య, ఇతర అభిమానులు ఆపినట్లు వీడియోలో కనపడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. అభిమాని పట్ల రవూఫ్ ప్రవర్తన కారణంగా అతని స్వంత దేశంలోని అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకుంటారు. దేశం తరఫున ఆడేటప్పుడు ఇలాంటివి మామూలేనని, ఇలాంటివి చూసిచూడనట్లు వ్యవహరించాలని నెటిజన్లు వ్యాఖ్యానించారు.
Fans must behave, players are with families and have a personal life too. Abusing and chanting isn't the way! Disgusting behavior 👎🏼👎🏼👎🏼
Haris Rauf was furious, this isn't good 👀 #T20WorldCuppic.twitter.com/tc9EhcW3j1
— Farid Khan (@_FaridKhan) June 18, 2024