Mohammad Rizwan: ఘోరపరాజయాల తర్వాత, పాక్ క్రికెట్‌లో రాజకీయాలపై పెదవి విప్పిన రిజ్వాన్..
- పాక్ క్రికెట్‌లో రాజకీయాలపై పెదవి విప్పిన రిజ్వాన్..
- ఘోర పరాజయాలతో తీవ్ర విమర్శలు..
- బాబర్
- షాషీన్ అఫ్రిది మధ్య విభేదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Rizwan: టీ 20 వరల్డ్ కప్‌లో ఘోర ప్రదర్శనపై పాకిస్తాన్ క్రికెట్ టీం సొంతదేశ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీలు ఒకడుగు ముందుకేసి మొత్తం టీంలోని ఆటగాళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టోర్నీలో పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడమే కాకుండా చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు టీ20 వరల్డ్ కప్‌ని భారత్ గెలవడం ఆ దేశ ప్రజల ఆగ్రహంపై మరింత కారం చల్లినట్లైంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులో గ్రూపులు పెరిగాయని, ఒక జట్టుగా ఆటగాళ్లు ఆడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూపు దశలోనే నిష్క్రమించడంపై పాక్ జట్టు విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే, జట్టు పరాజయం, జట్టులో రాజకీయాలపై వస్తున్న విమర్శలపై ఆ దేశ కీపర్ కమ్ ఓపెనర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ‘‘జట్టులో కొన్ని రాజకీయాలు ఉన్నాయని, కొన్ని విభేదాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఏవైనా విభేదాలు ఉంటే, మేము ముందు ఆటలు కూడా కోల్పోయాము. ఈ ఆరోపణలు అన్ని వట్టివే. ఇదే జట్టు ఫైనల్స్, సెమీ ఫైనల్స్ ఆడింది, కానీ మేం ట్రోఫీని గెలవలేదన్నది నిజం’’ అని పెషావర్‌లో విలేకరుల సమావేశంలో రిజ్వాన్ అన్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Read Also: Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!
తమ ఆటతీరు కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నామని ఆయన సమర్థించుకున్నారు. తాము అంచనాలను అందుకోలేదని, కాబట్టి విమర్శలకు అర్హులమని చెప్పారు. విమర్శలను ఎదుర్కోలేని ఆటగాళ్లు విజయం సాధించలేరని చెప్పారు. టీ20 ప్రపంచకప్ ప్రదర్శనతో తాము నిరాశ చెందామని చెప్పారు. తమ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు.
అయితే నివేదికల ప్రకారం, కెప్టెన్‌గా తిరిగి వచ్చిన బాబర్ అజామ్ జట్టును ఏకతాటిపైకి తీసుకురాలేదని తెలుస్తోంది. కెప్టెన్సీ కోల్పోవడంతో షాహీన్ షా అఫ్రిదీ అసంతృప్తితో ఉన్నాడని, అవసరమైనప్పుడు బాబర్ అతడికి సపోర్ట్ ఇవ్వలేదని, మరోవైపు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీకి పరిగణించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!