IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చేనా..?
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు జట్టులో మార్పులపై ఆసక్తికర చర్చ..
- టీమిండియాలో పలు మార్పులు చేయాలని సూచించిన మాజీ క్రికెటర్ గవాస్కర్..
- పాక్ తో జరిగే మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని గవాస్కర్ అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: టీ20 వరల్డ్ కప్‌లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మార్పులపై ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ భారీగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు పూర్తి చేయలేదని గుర్తు చేశారు. మిగతా బౌలర్లు వికెట్లు సాధించారు. ఈ పరిణామాలు పాకిస్థాన్ మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని జట్టు వ్యూహం మార్చవచ్చనే సంకేతాలు ఉన్నాయని గవాస్కర్ చెప్పారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
అయితే, శ్రీలంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన చరిత్ర ఉందని సునీల్ గవాస్కర్ గుర్తు చేశారు. కొలంబోలో జరిగే పాక్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని అంచనా వేశారు. ఇక, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ మార్పులు కూడా దాయాది జట్టును దృష్టిలో పెట్టుకుని చేశారని ఆయన విశ్లేషించారు. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ వేయడం అర్ష్‌దీప్ స్థానంపై సందేహాలు వస్తున్నాయి. అలాగే, వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి ఉంటే ఐదు లేదా ఆరు వికెట్లు తీసేవాడని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీయడం కూడా మంచి పరిణామం అని మాజీ క్రికెటర్ సునీల్ తెలిపారు.
Read Also: Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ప్రియుడు
ఇక, బ్యాటర్ సంజూ శాంసన్ ఆటపై కూడా గవాస్కర్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ శర్మ స్థానంలో వచ్చిన సంజూ, 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. అతను క్రీజ్‌లో చాలా లోతుగా వెళ్లి ఫ్లిక్ షాట్ ఆడడం సాంకేతిక సమస్యగా మారుతోంది.. కొత్త బంతితో ఓపెనింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరమని సూచించారు. అయితే, నమీబియా బౌలర్లు సంజూ కోసం ప్రత్యేక ఫీల్డింగ్ సెట్టింగ్ పెట్టారు.. అయినప్పటికీ కొన్ని అద్భుత షాట్లు ఆడటం అతనికి ఆత్మవిశ్వాసం ఇస్తుందన్నారు. పాక్ మ్యాచ్‌లో అవకాశం వస్తే క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!