Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
- వైభవ్ సూర్యవంశీ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
- వెస్టిండీస్‌తో సిరీస్‌లో అవకాశం కోసం ఎదురుచూపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత్-వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలక సమరం నేడు బెంగళూరు వేదికగా జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇరు జట్లు 2-2తో సమంగా ఉండటంతో నేడు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో టీ20 సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ వైభవ్‌కు అవకాశం రాలేదు. కేవలం వాటర్ బాయ్ గా మాత్రమే జట్టుకు సేవలు అందిస్తున్నాడు వైభవ్. తాజాగా ఐదో టీ20కి ముందు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసిన వైభవ్.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనితో తనకు అవకాశం వస్తుందనే నమ్మకంతోనే ఉన్నాడనే సంకేతాన్ని చెప్పకనే చెప్పేసాడు. ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్.. కేవలం రెండు మ్యాచ్‌ల ఆడిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
Also Read
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగుతుండటంతో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఐదో టీ20 సిరీస్ డిసైడర్ కావడంతో ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా వైభవ్ ఆడడం అసాధ్యమే.. వైభవ్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ గెలిచిన ఓపెనింగ్ జోడీకి ప్రస్తుతానికి కొనసాగింపు ఇస్తామని, వైభవ్ తన అవకాశం కోసం వేచి చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో వైభవ్ తన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూస్తున్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
-
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
-
Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!