Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- శ్రీలంకలో శనివారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం
- మూడు గంటలకు పైగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- నీటి సరఫరా, ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్‌లపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka: శ్రీలంకలో శనివారం భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. శ్రీలంక వ్యాప్తంగా 3 గంటలకు పైగా విద్యుత్ అందుబాటులో లేదు. విద్యుత్ అంతరాయంతో నీటి సరఫరా, ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ ప్రభావితమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దశల వారీగా విద్యుత్‌ను పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
శనివారం విద్యుత్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడినట్లు శ్రీలంక అధికారులు చెప్పారు. విద్యుత్ అంతరాయం కారణంగా శ్రీలంకలో నీటి సరఫరా నిలిచిపోయింది. నీటిని వృధా చేయవద్దని శ్రీలంక నీటి సరఫరా సంస్థ ప్రజల్ని కోరింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.
Also Read
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాంకేతిక కారణంగా విద్యుత్ నిలిచిపోయిందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి అనుసర కరుణతిలక తెలిపారు. అయితే, అంతరాయానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం.. దేశంలోని మధ్య పర్వత ప్రాంతంలో ఉన్న జల విద్యుత్ కేంద్రంలో ఏర్పడిన సాంకేతిక లోపమే ఈ అంతరాయానికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు, సోలార్ ప్యానెళ్లు కలిగినవారు వాటిని పవర్ గ్రిడ్ నుంచి డిస్ కనెక్ట్ చేయాలని కోరారు. విద్యుత్ వ్యవస్థ బాగుపడే వరకు ఈ చర్య తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!