IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NED: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశను అజేయంగా ముగించాలని భారత్ నేడు నెదర్లాండ్స్‌తో బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. పాకిస్థాన్‌పై 61 పరుగుల ఘన విజయం భారత్ ను సూపర్ 8 దశకు చేర్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇది కేవలం ఫార్మాలిటీ మ్యాచ్ కాదనే చెప్పవచ్చు. దీనికి కారణం ఆదివారం దక్షిణాఫ్రికాతో కీలక పోరు జరగనుంది. అందుకే ఈ మ్యాచ్‌ను జట్టు కాంబినేషన్లను మెరుగుపరుచుకునే అవకాశంగా చూస్తోంది.
ఇక జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ టోర్నీలో పూర్తిగా తన ఫామ్ ను అందుకోలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో డక్ అవ్వడం, తరువాత అనారోగ్యంతో నమీబియాపై మ్యాచ్ మిస్ కావడం, పాకిస్థాన్‌పై మళ్లీ తొలి బంతికే ఔట్ అవ్వడం అతనికి ఫామ్ లేమిని చూపుతున్నాయి. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక పాకిస్థాన్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ స్పిన్నర్లను జాగ్రత్తగా ఎదుర్కొన్నా.. మొత్తం మీద స్పిన్ బౌలింగ్‌పై భారత బ్యాటింగ్ కొంత బలహీనంగానే కనిపిస్తోంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
YouTube: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన YouTube సేవలు
బౌలింగ్ కోచ్ సితాంశు కోటక్ ప్రకారం.. అర్హత సాధించినప్పటికీ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన లేదని తెలిపారు. పాకిస్థాన్‌పై సాయిమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా వికెట్లు తీసిన బుమ్రా స్పెల్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. సూపర్ 8 దశకు ముందు అతన్ని రిథమ్‌లో ఉంచాలనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం ఉంది. అహ్మదాబాద్ పిచ్ వేగానికి అనుకూలంగా ఉండొచ్చని భావిస్తూ కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకునే అవకాశముంది.
నెదర్లాండ్స్ జట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోలేం. వారు గతంలో ప్రపంచ వేదికపై పెద్ద జట్లను ఓడించి ఆశ్చర్యపరిచారు. బౌలింగ్ విభాగంలో లోగన్ వాన్ బీక్, బాస్ డి లీడే, ఫ్రెడ్ క్లాసెన్, ఆర్యన్ దత్, రూలఫ్ వాన్ డర్ మెర్వే వంటి ఆటగాళ్లు విభిన్నమైన బౌలింగ్ శైలితో ప్రభావం చూపగలరు. వారికి సూపర్ 8 అవకాశాలు ఇతర ఫలితాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, గెలుపు కోసం కచ్చితంగా టఫ్ ఫిఘ్త్ చేయడం పక్కా.. భారత్–నెదర్లాండ్స్ మధ్య టీ20 అంతర్జాతీయాల్లో ఒక్కసారే తలపడ్డాయి. 2022 టీ20 ప్రపంచకప్‌లో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో గెలిచింది.
Seema Haider: 11 నెలల క్రితం ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన సీమా హైదర్.. ఆరోసారి తల్లైంది..
అంచనా జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI):
మైఖేల్ లెవిట్, మ్యాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కొలిన్ అకర్మన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్ & వికెట్ కీపర్), జాక్ లయన్-కాచెట్, లోగన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, రూలఫ్ వాన్ డర్ మెర్వే, కైల్ క్లైన్/ఫ్రెడ్ క్లాసెన్/పాల్ వాన్ మీకెరెన్‌లో ఇద్దరు.
తాజావార్తలు
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
-
Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
-
AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
-
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
-
Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!